సినిమా
Megastar-Super Star: దసరా, సంక్రాతి బరిలో మెగాస్టార్-సూపర్ స్టార్!
Megastar-Super Star: ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా, అక్టోబర్ 15వ తేదీన సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇదే, నిజమైతే బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఉండబోతోంది.
