Chiranjeevi : కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ..
మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తాజాగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.ఏపీలో బీజేపీతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలుపుకోసం బీజేపీ పార్టీ మెగాస్టార్ చిరంజీవి సాయం కోరనుందా? అనే చర్చ మొదలైంది. ఇటీవల చిరంజీవి,ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం వెనుక గల కారణాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి సమస్యల నుంచి సినీ కళాకారులు, కార్మికులు, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
