National

Blue Drum case: 'బ్లూ డ్రమ్' మర్డర్ కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు!

Blue Drum case: అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చి, శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో పూడ్చేసిన భయానక ఘటనలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసులో నిందితురాలైన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇలాంటి అమానవీయ నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తాయని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా ఈ కఠిన తీర్పును ప్రకటించారు.గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతి కిరాతకంగా అంతమొందించింది. అంతటితో ఆగకుండా, నేరం బయటపడకుండా ఉండేందుకు సౌరభ్ మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికివేసింది.