తెలంగాణ
మీనాక్షి నటరాజన్ ఔట్? కొత్తగా వచ్చేది ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను త్వరలోనే తప్పించనున్నారని మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులు, కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం, మరో నలుగురు జిల్లా స్థాయి నేతలకు షోకాజు నోటీసులు ఇవ్వడం..పదవుల కోసం కొందరు సీనియర్లు అధికారపార్టీనే టార్గెట్ చేయడం, పదే పదే నేతలు ఢిల్లీకి వస్తూ ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అయినట్టు తెలుస్తోంది. నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మీనాక్షి నటరాజన్ సరిగా హ్యండిల్ చేయలేకపోతున్నారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేేస్తున్నట్టు తెలిసింది.
