తెలంగాణ

మేడిగడ్డ టూర్ ఒక జాలీట్రిప్.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కకర పరిస్థితులను అడ్వాంటెజ్‌గా తీసుకుని, ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని దానం నాగేందర్ మండిపడ్డారు.ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల వెనుక కేవలం రాజకీయ స్వార్థం తప్పా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేపట్టిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ పర్యటన కేవలం ఒక ‘జాలీ ట్రిప్’ మాత్రమేనని దానం నాగేందర్ అభివర్ణించారు.రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం బీఆర్ఎస్ నేతలకు తెలీదా? అని ప్రశ్నించారు.