తెలంగాణ
మెడికవర్ హాస్పిటల్లో మరో దారుణం.. చికిత్స కోసం వెళ్లిన చిన్నారి మృతి
Medicover: సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. చికిత్స కోసం వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. కిడ్నీలో రాళ్లకు చికిత్స చేయించుకోవడానికి మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన యువ న్యాయవాది ఐశ్వర్య చనిపోయిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. అది మరువకముందే.. అక్కడ మరో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన ఓ చిన్నారి అనూహ్యంగా మరణించింది. అంతేకాదు పాప చనిపోయిన విషయాన్ని దాచి చికిత్స అందిస్తున్నట్లు మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది ఆడిన డ్రామా విస్మయానికి గురి చేసింది. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
