స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

శామీర్ పేట్‌లో కదం తొక్కిన కిసాన్!..

బొమ్మరాసిపేట్‌లో వెయ్యి ఎకరాల భూముల పాస్‌బుక్‌ల బదిలీ వ్యవహారం రైతుల్లో ఆగ్రహం రేపుతోంది. 2021 హైకోర్టు తీర్పు పేరుతో పాత రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించకుండానే భూములు బదిలీ చేస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు, తమ సమస్యను కేసీఆర్‌కు చెప్పేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూములను కాపాడుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.