తెలంగాణ

జూదం ఆడుతూ మళ్లీ దొరికిన మెదక్ డీసీసీబీ చైర్మన్ ..

మెదక్ డీసీసీబీ చైర్మన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మెదక్ డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన చిట్టి దేవేందర్ రెడ్డి మరోసారి జూదం ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం ఉదయం కొంపల్లిలో కొందరు జూదం ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు పేకాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నట్టు గుర్తించారు.అయితే, ఆయన ఇలా పేకాటలో దొరకడం ఇది రెండోసారి అని సమాచారం. గతంలో ఆయన థాయ్ లాండ్ పర్యటనలో భాగంగా క్యాసినో ఆడుతూ దొరికారు.ఆనాడు చీకోటి ప్రవీణ్ వెంట వెళ్లి క్యాసినో ఆడుతూ దొరికిన వారిలో చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, తాను స్నేహితులను కలవాడనికి వెళ్లాలనని, అక్కడ క్యాసినో ఆడలేదని, తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ ఘటన జరిగి మూడేండ్లు కావొచ్చింది.