తెలంగాణ

Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?

ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బయటకు అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా నేతల మధ్య ఈగోలు, ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరాయి. సొంత పార్టీ నిర్వహించే కీలక ఆందోళన కార్యక్రమాలకు ముఖం చాటేస్తూ, ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రైవేట్ వేదికలపై నవ్వులు చిందిస్తున్న ఓ కాషాయ ప్రజాప్రతినిధి తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అనుసరిస్తున్న వింత వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది.