National
యూపీఐపై ఎండీఆర్ చార్జీలు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు షాక్
యూపీఐ లావాదేవీలు రూ.2 వేలకు మించితే చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిరుపేదలు, చిరు వ్యాపారులను దోచుకునేందుకు కేంద్రం చార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో కేంద్రప్రభుత్వం, ఆర్బీఐకి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. రూ.2 వేలకు మించిన యూపీఐ (UPI) చెల్లింపులపై ఎండీఆర్ (MDR) చార్జీల విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
