క్రైమ్

5 నిమిషాల్లో భారీ చోరీ.. 3కోట్ల విలువైన డైమండ్స్, బంగారు నగలు అపహరణ

CaratLane: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. క్యారెట్ లేన్ (Carat Lane) జువెలరీ షోరూమ్ లో దొంగలు పడ్డారు. సుమారు 3కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షట్టర్ వంచి షాపులోకి చొరబడిన దుండగులు డైమండ్స్ తో పాటు బంగారు నగలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు షోరూమ్ కి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.