ఏపీ

బస్సులో భారీగా పేలుడు పదార్థాలు.. తప్పిన పెనుప్రమాదం!

ఏపీలో పెనుప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడ పట్టణంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును గుర్తించిన సదరు ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బస్సు సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిసింది.దీంతో బస్సు డ్రైవర్ బస్సును రద్దీలేని ప్రదేశంలో నిలపగా.. కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం బస్సులోని అనుమానాస్పద బ్యాగును గుర్తించి తనిఖీలు చేపట్టారు. అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు.