International
భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్కు షాక్!
భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో విదేశీ బృందాల సాయాన్ని తీసుకోకూడదని నిర్ణయించింది. తమ దేశ భద్రతా బలగాలు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేస్తూ, భారత్, చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలు పంపిన రెస్క్యూ సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
