National
Massive floods: అస్సాంలో ఎడతెరిపి లేని వర్షాలు.. వరదలతో 10 మంది మృతి
అస్సాంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. వరదల తాకిడికి ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 జిల్లాల్లోని 794 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివసాగర్, జోర్హాట్, దిబ్రూఘర్, కమ్‌రూప్ వంటి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 3.62లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
