క్రైమ్
హైదరాబాద్‌లో నాలుగు చోట్ల భారీ పేలుళ్లు!
హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఉన్నట్టుండి భారీ శబ్దాలు రావడంతో భయంతో జనాలు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు, మరణాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బాంబులు పేలాయా? ఏదైనా కెమికల్ బాక్సులు పేలాయా? అనేది తెలియ రాలేదు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్టు సమాచారం. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్ పరిసర ప్రాంతాల్లో వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర గందగోళ వాతావరణం నెలకొంది.
