International
వనాటు దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన 'వనాటు' (Vanuatu) తీర ప్రాంతంలో శనివారం ఉదయం అత్యంత భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైనట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS), పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించాయి. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులో కేంద్రీకృతమై ఉండటంతో సమీప తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచివుందంటూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తొలుత హెచ్చరికలు జారీ చేసింది.
