ఏపీ
చిరంజీవి పాటకు మాస్ స్టెప్పులు.. ‘డీజే’ బీట్‌కు కుప్పకూలాడు
ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనం వేడుకల్లో డీజే సాంగ్స్‌కు కాకర్లమూడి ఏసు (48)ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మరికొంత కూడా డ్యాన్సులు వేశారు.ఉన్నట్టుండి ఏసు కుప్పకూలడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో ఏసు మరణించినట్టు పేర్కొన్నారు.
