వ్యాపారం

Maruti Suzuki: పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు.. ఎప్పటి నుంచి, ఎంత అంటే..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గరిష్ఠంగా 30వేల రూపాయల వరకు ధరలు పెరగనున్నాయని వెల్లడించింది. ఆగస్టు నెల నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది.