క్రైమ్

నెల క్రితమే వేరొకరితో పెళ్లి.. ప్రియురాలు కాదన్నదని!

విజయవాడకు చెందిన నాగరాజు (31)కు మూడేళ్ల కిందట తన ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు దిగిన వివాహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.అయితే, నాగరాజుకి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మూడు నెలల కిందట పక్కనున్న డాబాలోకి సదరు మహిళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది. పెళ్లయిన 35 రోజుల తర్వాత నాగరాజు భార్య 16 రోజుల పండుగకు పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే వివాహితను మర్చిపోలేక తన ఇంట్లోకి తిరిగి అద్దెకు రావాలని అతడు ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.అందుకు సదరు మహిళ నిరాకరించింది.ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుందామని హితవు పలికింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజు ఆమెను కత్తితో పొడిచి హత్యచేసి ఆపై తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.