సినిమా
తొలి సినిమా హిట్.. కానీ ఆటో తోలుకుంటున్న నటుడు!..
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైమ్ మారుతుందో చెప్పలేం. అలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నటుడు మారిముత్తు కథ ఎంతో స్ఫూర్తిదాయకం. పేద కుటుంబంలో పుట్టి, మూడో తరగతిలోనే చదువు మానేసి.. లైట్లు, మైక్ సెట్ల షాపులో పనిచేశారు. సినిమాపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి, ‘సుబ్రమణ్యపురం’లో నటించే అవకాశం దక్కించుకున్నారు. సినిమా హిట్ అయినా వరుస అవకాశాలు రాలేదు. కుటుంబం కోసం రేడియో మెకానిక్‌గా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా.. మరో అవకాశం వస్తుంది అనే ఆశతో ముందుకు సాగుతున్న మారిముత్తు నిజంగా అభినందనీయుడు.
