తెలంగాణ
మావోయిస్టుల మరణాలకు గుర్తింపు ఎక్కడ.. సంస్మరణ దినోత్సవాలు ఇంకెప్పుడు?
సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకుంటూ ఏటా సంస్మరణ వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 21న మొదలైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు పది రోజుల పాటు కొనసాగుతాయి. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం, ఉద్యోగాలు, అవార్డులు ఇచ్చి అండగా నిలుస్తోంది. అయితే సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.పోలీసుల త్యాగాలను ఎవరూ కాదనడం లేదు. కానీ అదే సమయంలో పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అడవి బాట పట్టి ప్రాణాలు వదిలిన మావోయిస్టుల సంగతేంటి? అనే గొంతులు నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణాలిస్తే, అణగారిన ప్రజల హక్కుల కోసం మావోలు బలైపోయారని కొందరు వాదిస్తున్నారు.
