ఏపీ

మణిపూర్ వర్సెస్ ఏపీ.. కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ

ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఏపీ, మణిపూర్ విద్యార్థినులు రెండు గ్రూపులుగా ఏర్పడి దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం స్పందించారు.హుటాహుటిన ఘర్షణ నెలకొన్న హాస్టల్‌కు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..ఏపీలోని కాకినాడ జిల్లాలో గల ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో మొబైల్ ఫోన్ మాయమైంది. ఫోన్ పొగొట్టుకున్న విద్యార్థిని తోటి విద్యార్థినులను ప్రశ్నించగా.. చిన్న వాగ్వాదం నెలకొన్నట్టు సమాచారం.తీరా అది కాస్త తెలుగు వర్సెస్ మణిపూర్ విద్యార్థుల మధ్య గ్రూప్ వార్‌గా మారింది. విద్యార్థినుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయగా.. బకెట్లు, కర్రలు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం.