తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి
ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రమేష్ ను పట్టుకున్నారు. లంచం గురించి సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు మండల వ్యవసాయ కార్యాలయంలో మెరుపు దాడి చేశారు. ఏవో రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
