సినిమా
Mamitha Baiju: అల్లు అర్జున్ కి డైహార్ట్ ఫ్యాన్..ఒక్కో సినిమా పదిసార్లు చూస్తా
Mamitha Baiju: మమిత బైజుకి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతటి అభిమానమో మాటల్లో చెప్పలేనంటోంది. ఆయనలా డ్రసింగ్ అవడం..స్లీవ్ లెస్ టీ షర్ట్ పై షర్ట్ వేసుకుంటే అలా, మమిత కూడా డ్రస్ వేసుకొని అబ్బాయిలా తిరిగేదట. అల్లు అర్జున్ ప్రతీ సినిమాను పదేసి సార్లు చూస్తుందట. ఇండస్ట్రీకొచ్చిన అతికొద్ది కాలంలోనే మంచి క్రేజీ హీరోయిన్గా మారిన మమిత బైజు తాజాగా సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీపై తనకున్న గాఢమైన అభిమాన్ని తెలియజేసింది మమిత. ప్రేమలు, డ్యూడ్ సినిమాతో బాగా పాపులర్ అయింది. సౌత్ లో ఇప్పుడు మమిత ఫుల్ ఫాంలో ఉంది.
