సినిమా
Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!
Malavika Mohanan: మాస్ మహారాజ్ రవితేజ-శ్రీవిష్ణు కలిసి చేస్తున్న సినిమాలో శ్రీవిష్ణు కి జంటగా మాళవిక మోహనన్ ఎంపికైందట. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ రవితేజ సరసన ఎంపికైనట్టుగా తెలుస్తోంది. హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. 2027, సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, ది రాజాసాబ్ తర్వాత ఇక టాలీవుడ్ నుంచి అవకాశాలు రావనుకున్న మాళవికకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది నిజమే అయితే..గొప్ప అవకాశమే అనుకోవాలి.
