క్రైమ్
YoutuberMadhumitha: ఇంట్లో రూ.కోటి చోరీ జరిగిన క్షణాల్లోనే రీల్స్.. యూట్యూబర్ మధుమిత తీరుపై నెటిజన్లు షాక్!
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మధుమిత ఇంట్లో భారీ దొంగతనం జరిగినప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు చోరీకి గురైన కొద్ది గంటల్లోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయి దాదాపు కోటిన్నర వ్యూస్‌ను సాధించడం గమనార్హం. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణంలో మధుమిత తన భర్త వినోద్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటోంది.
