National

Make in India: భారత్‌కు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్.. 'మేక్ ఇన్ ఇండియా'కు భారీ ప్రాజెక్ట్!

భారత వాయుసేన (IAF) యుద్ధ సామర్థ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే దిశగా ఒక చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ.3.25లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనలో భాగంగా, ఏకంగా 94జెట్లను భారత్‌లోనే తయారు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఈమేరకు ఫ్రెంచ్ రక్షణ దిగ్గజాలు సంయుక్తంగా సిద్ధం చేసిన అధికారిక ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ కీలక ఒప్పందం ఖరారైతే, ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాల తయారీ అసెంబ్లీ లైన్ ఏర్పడటం చరిత్రలోనే ఇదే తొలిసారి కానుంది.