అభిప్రాయం
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన లేఖ!
ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల తీరుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ డీజీపీకి ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈకేసులో విచారణాధికారులు చట్టబద్ధమైన అరెస్ట్ నిబంధనలను పాటించలేదని, అత్యంత తొందరపాటుతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారింపజేయాలని ఆయన కోరారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళా అధికారిణి (2024 బ్యాచ్ IPS), ఉదయ్ కృష్ణా రెడ్డి (2025 బ్యాచ్ IPS)ల మధ్య ఉన్నది సమ్మతితో కూడిన వ్యక్తిగత ప్రేమ సంబంధమని తెలిపారు.
