క్రైమ్

సికింద్రాబాద్‌లో చిన్నారి కిడ్నాప్, హత్యకేసులో బిగ్ ట్విస్ట్!

సికింద్రాబాద్‌‌‌‌లో చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు తేల్చారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్టు నిర్దారణకు వచ్చారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వివరాల్లోకివెళితే.. కౌకూర్‌లోని 'విల్లా ఆర్చిడ్స్' అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్‌ను కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. డబ్బులు సర్దుబాటు చేస్తామని, పాపను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నా నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులను గమనించిన నిందితుడు ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో చిన్నారిని హత్య చేశాడు.అనంతరం అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీళ్ల సంపులో పడేసి పరారయ్యాడు.