National

కాంగ్రెస్‌లో భారీ కుదుపు.. పంజాబ్ పీసీసీ చీఫ్ రాజీనామా

వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నిన్న రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా రాజా వారింగ్, మాజీ సీఎం చరణ్‌‌జీత్ సింగ్ చన్నీ వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పార్టీ నాయకత్వం విషయంలో ఇరువర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి హైకమాండ్ వద్ద బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎన్నికల ముందు నేతల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే దిశగా పావులు కదిపింది. అధినాయకత్వం ఆదేశాల మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.