రాజకీయాలు

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఎదురుదెబ్బ

 తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డీఎంకే అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే తిరస్కరించాలని కోరుతూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ ఎన్నికల పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.