తెలంగాణ కేబినెట్లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?
రాష్ట్ర కేబినెట్లో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరగగా.. ఆశావహులు జోరుగా లాబీయింగ్ చేశారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజికవర్గం, ఎస్సీ సామాజికవర్గం నుంచి కూడా పలువురు లైన్లో ఉన్నారు.వీరంతా తమకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ వద్ద జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధిష్టానం రాష్ట్ర కేబినెట్లో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చిస్తున్న అధిష్టానం పెద్దలు.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అనంతరం కేబినెట్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం.అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
