తెలంగాణ

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు

హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా గల హరిజన సేవా సంఘం కాలనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న వారి పూరి గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఇండ్లు మొత్తం అగ్నికి ఆహుతవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. హరిజన సేవా సంఘం కాలనీలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల నివారణ కోసం పెట్టిన పొగ వలన మంటలు చెలరేగి పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయాయి.అంతటితో ఆగకుండా మంటలు పక్కనే ఉన్న కట్టెల షాపునకు వ్యాపించాయి. దీంతో కట్టెల షాపు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.