National
రాహల్ గాంధీ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం.. యూపీ పోలీస్ కీలక నిర్ణయం
వియత్నాం పర్యటన ముగించుకుని వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. అయితే,రాహుల్ పర్యటనలో భాగంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.కాన్వాయ్‌లోని 5 కార్లు, అంబులెన్స్ ఒకదానివెనుక మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడినట్టు సమాచారం. కొందరు పోలీసులకు కూడా గాయాలు అయినట్టు సమాచారం. కాగా, కాన్వాయ్ ప్రమాదంలో రాహుల్ గాంధీ తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల్లోని పోలీసులు, సిబ్బందిని బయటకు తీశారు.
