క్రైమ్
శంషాబాద్‌లో భారీ ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు
శంషాబాద్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అధిక వేగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది.
