సినిమా

Mahesh-Sandeep Reddy: మహేష్‌తో, సందీప్ రెడ్డి వంగ "డెవిల్" కన్‌ఫర్మేషన్ ఇదుగో

Mahesh-Sandeep Reddy: ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్న సందీప్..దీని, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'డెవిల్' అనే సినిమాను చేస్తాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మహేష్ వారణాసి పూర్తి చేసి, సందీప్ స్పిరిట్ పూర్తి చేసి ఆ తర్వాత వీరిద్దరు 'డెవిల్' సినిమా కోసం కలవబోతున్నట్టుగా సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి షేర్ చేసిన వీడియోతో ఓ క్లారిటీ వచ్చింది. మహేష్ బర్త్ డే సందర్భంగా సందీప్ షేర్ చేసిన ఈ వీడియోతో వీరి ఫ్యాచర్ ప్రాజెక్ట్‌ని కన్‌ఫర్మ్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. గతంలో మహేష్ బాబు చేసిన ఒక కమర్షియల్ యాడ్ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం కూడా వహించాడు.