సినిమా

Mahesh-Rajamouli: "వారణాసి" కౌంట్ డౌన్ మొదలు..ఇంకా 200 రోజులే

Mahesh-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న వారణాసి (గ్లోబ్ ట్రాటర్) ఆగమనానికి ఇంకా 200 రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో వదిలింది. యావత్ ప్రపంచ దేశాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పాడ్ కాస్ట్ ద్వారా ఈ పాన్ వరల్డ్ అడ్వంచర్‌పై రాజమౌళి అంచనాలు పెంచే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో 200 రోజుల వారణాసి కౌంట్ డౌన్ మొదలు..అని పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.