సినిమా
Mahakali-Glimpse:గ్లింప్స్‌తోనే గూస్బంప్స్..మహాకాళి మరో ఇండస్ట్రీ హిట్ పక్కా
Mahakali-Glimpse: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా భారీ చిత్రాలను అందిస్తున్నాడు. ఇప్పుడు వస్తోన్న మహాకాళి కూడా ఈ యూనివర్స్ నుంచే వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ సమర్పిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ పేరుతో మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్యుడు’ పాత్రలో నటిస్తుండగా, ఓజీతో మళ్ళీ లైం లైట్ లోకి వచ్చిన శ్రియా రెడ్డి ‘మహాకాళి’గా అలరించనుంది.
