తెలంగాణ
Mahabubnagar: అర్హత లేకున్నా వైద్యం.. టీజీఎంసీ దాడుల్లో బయటపడిన సంచలన విషయాలు!..
ఉమ్మడి జిల్లాలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ టాస్క్‌ఫోర్స్ కొరడా ఝళిపించింది. ఆయుర్వేద, హోమియోపతి వంటి ఆయూష్ వైద్య అర్హతలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆధునిక వైద్యం చేస్తున్నవారు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్నవారు, మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నవారిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
కల్వకుర్తి, ఆమన్‌గల్లు మండలాల్లోని పలు క్లినిక్‌లు, నర్సింగ్ హోంలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై టీజీఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆధునిక వైద్యం చేయడానికి అవసరమైన అర్హత, రిజిస్ట్రేషన్ లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు, అల్లోపతి మందులు రాస్తున్నట్లు గుర్తించారు.
