TG: ఆయుధాల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. గన్ డీలర్‌తో మల్లేశ్ సీక్రెట్ లింకులు!
TG: మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దోపిడీ కేవలం స్థానిక నేరస్థుల పని మాత్రమే కాదని, దీని వెనుక దేశవ్యాప్త అక్రమ ఆయుధాల మాఫియా హస్తం ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. 10 రోజుల పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు, మాజీ ఆర్మీ జవాన్ మల్లేశ్ విచారణలో వెల్లడించిన వివరాలతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.ఆర్మీ నుంచి కొల్లగొట్టిన అత్యాధునిక తుపాకులను కోల్‌కతాకు చెందిన బడా ఆయుధ వ్యాపారి అవల్ దెయ్కు విక్రయించేందుకు మల్లేశ్ ముందే డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 2022లోనే బీర్బల్ షా అనే మధ్యవర్తి ద్వారా అవల్ దెయ్‌తో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది. గతంలోనే వారి వద్ద రూ.10 వేలకు ఓ తుపాకీని కొనుగోలు చేసి దోపిడీలకు యత్నించిన నేర చరిత్ర మల్లేశ్‌కు ఉంది. ఈ పాత పరిచయాలతోనే ఆర్మీ ఆయుధాగారం నుంచి దొంగిలించిన ఆయుధాలను భారీ మొత్తానికి వారికి అప్పగించేందుకు మల్లేశ్ ప్లాన్ రెడీ చేశాడు.
