National
సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కు ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. ఆ ఘటనపై దీప్కే స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొందరు వ్యక్తులు తనను ముఖ్యమంత్రిగా భావించి, విమర్శించారని అన్నారు. అందుకుగానూ పిల్లల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ.. మధ్యప్రదేశ్ సీఎంగా రాజీనామా చేస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
