తెలంగాణ
Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!
పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈశ్వర్ సాయి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది. తన జీవితంతో ఆడుకున్న ఈశ్వర్ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో గతంలో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం..
