తెలంగాణ
మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!
ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తాను మోసపోయానని బాధితురాలు మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పోలీసులకు అందుబాటులో లేకుండా పోవడంతో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. కొన్ని రోజుల క్రితం ఒక హోటల్ గదిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
