‘మాధురి నన్ను క్షమించు’.. ఈశ్వర్ సాయి మరో వీడియో
తెలంగాణ జానపద నటులు ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ ఒకే గదిలో అర్ధనగ్నం దొరకడంతో దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.‘బాసింగ బలాలు’ సాంగ్తో వీరిద్దరికి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా, వీరిద్దరి కాంబోలో చాలానే ఫోక్స్ వచ్చాయి. వాస్తవానికి వీరు ఒకే గదిలో దొరికిన కొన్ని గంటల్లో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్స్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చాయి.ఈ జంట ఎవరా? అని తెలుసుకోవడానికి వీరు నటించిన సాంగ్స్ కోసం నెటిజన్స్ ప్రయత్నించినట్టు తెలిసింది. దీనిపై మాధురి రాథోడ్ ప్రస్తుతం మౌనంగా ఉండిపోగా.. ఈశ్వర్ సాయి మాత్రం తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ‘బాత్రూమ్ వాడుకోడానికే మాత్రం నేను మాధురి గదికి వెళ్లా.. నేను, మాధురి కేవలం ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యాం.నా భార్యను కొందరు తప్పు దారి పట్టించారు. ఆ ఆవేశంలోనే ఆమె దాడి చేసింది. ఆ క్షణంలో ఏమీ మాట్లాడొద్దని మౌనంగా ఉన్నా. అమ్మా మాధురి! ఈ విషయంలో నీకు క్షమాపణ చెబుతున్నా.. మీడియా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అంటూ వేడుకున్నారు.
