తెలంగాణ
ఇలా ఉంటే అధికారంలోకి ఎలా వస్తాం? బీజేపీ నేతలపై సీరియస్
BJP: తెలంగాణ బీజేపీ నేతలపై రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత నూతన ప్రధాన కార్యదర్శి మధుకర్ సీరియస్ అయ్యారు. వారికి క్లాస్ తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ పదాధికారుల (ఆఫీస్ బేరర్స్) సమావేశంలో నేతల తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆఫీస్ చుట్టూ తిరగడం మానేసి జిల్లాల్లో పని చేయాలంటూ సూచించారు. పదవులు తీసుకుని ఏసీ రూముల్లో కూర్చుంటామంటే సరిపోదన్నారు. ఎవరి జిల్లాల్లో వారు ఉండాల్సిందేని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
