క్రైమ్
Madhapur: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి.. ప్రియుడే హత్య చేశాడా?
హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఒక ఓయో(OYO) హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న(సోమవారం) మధ్యాహ్నం నగరానికి వచ్చి, సిద్ధిఖీనగర్ రోడ్డునంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' రూమ్ నంబర్ 303లో అద్దెకు దిగారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 1గంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది.
