క్రైమ్
రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!
మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన మనిషి రూపంలో ఉన్న మృగం.. ఒక్కసారిగా ఆ మహిళపై తన కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించింది. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోలేదు. అక్కడే సంచరిస్తున్న ఓ శునకం మాత్రం ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించింది.
