National

Lucknow Airport: లక్నో ఎయిర్‌పోర్ట్ వద్ద కలకలం.. కార్మికులకు తృటిలో తప్పిన ప్రమాదం!..

లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనుల్లో ఉన్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మూడు అంతస్తుల తాత్కాలిక వసతి గృహంలో ఉదయం 6:50 గంటలకు మంటలు చెలరేగాయి. పీవీసీ ప్యానెళ్లతో నిర్మించిన క్యాంప్ కావడంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. అక్కడ దాదాపు 500 మంది కార్మికులు ఉన్నప్పటికీ.. సిబ్బంది సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్ సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.