తెలంగాణ
LPGCyberFraud: ‘గ్యాస్ ఇన్స్పెక్షన్’ అని కాల్ వచ్చిందా? అయితే జాగ్రత్త!
దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలైన హెచ్పీ(HP), ఇండేన్ (Indane), భారత్ గ్యాస్ (Bharat Gas) నిబంధనల ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ వినియోగదారుల ఇంట్లో తప్పనిసరిగా సేఫ్టీ ఇన్ స్పెక్సన్ (Mandatory Safety Inspection) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ క్రమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రాంతాల్లో నకిలీ ఏజెంట్లు, కేటుగాళ్లు నకిలీ ఐడీలతో వచ్చి అమాయక ప్రజలను మోసగిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. నిజమైన తనిఖీలను ఎలా గుర్తించాలో, మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
