National

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు దగ్గరపడుతున్న డెడ్‌లైన్!..

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లలో నకిలీ, బోగస్ కనెక్షన్లను గుర్తించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ-కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో యాప్ ద్వారా ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానంతో పాటు ముఖ గుర్తింపు, వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.